TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కంకర ఓవర్‌లోడ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన సమయంలో టిప్పర్ యజమాని లక్ష్మణ్ వాహనంలోనే ఉన్నాడని, లడారం నుంచి శంకర్‌పల్లి వరకు అతనే డ్రైవ్ చేసినట్లు తెలిపారు. శంకర్‌పల్లి నుంచి డ్రైవర్ ఆకాష్ టిప్పర్ నడిపారని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన లక్ష్మణ్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.