TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద జరిగిన RTC బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించిన మరో వీడియో తాజాగా బయటకొచ్చింది. టిప్పర్ ఢీకొట్టి బస్సుపై పడటంతో అందులోని కంకర ప్రయాణికులపై పడింది. అందులో చిక్కుకున్న ప్రయాణికుల ఆర్తనాదాలు, కంకరలో ఇరుక్కుపోయిన వారిని తోటి ప్రయాణికులు కాపాడే దృశ్యాలు వీడియోలో కనిపించాయి.