మనం తీసుకునే మాంసాహారాల్లో చికెన్ , మటన్ ప్రధానంగా ఉంటాయి. అయితే చికెన్, మటన్ ఏది ఆరోగ్యానికి మంచిదనే సందేహం చాలా మందిలో ఉంది. 100 గ్రా. చికెన్ బ్రెస్ట్‌లో దాదాపు 31 గ్రా ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రా మటన్‌లో సుమారు 25 నుంచి 27 గ్రా. ప్రోటీన్ ఉంటుంది. మటన్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. చికెన్ త్వరగా జీర్ణమవుతుంది. మటన్ చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది. మటన్ లో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి.