దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలు తీవ్ర వాయు కాలుష్యంతో అల్లాడుతున్నాయి. గత రెండు వారాలుగా గాలి నాణ్యత సూచీ 400 దాటింది. ఈ నేపథ్యంలో, భారత్‌కు సహాయం చేయడానికి చైనా ముందుకు వచ్చింది. భారత్‌లోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూజింగ్ మాట్లాడుతూ, "చైనా ఒకప్పుడు తీవ్రమైన పొగమంచుతో ఇబ్బంది పడింది. అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నవారితో మా ప్రయాణాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. భారత్ త్వరలో ఆ పరిస్థితి నుంచి బయటపడుతుందని విశ్వసిస్తున్నాం" అని తెలిపారు.