జీ7, నాటో దేశాలకు చైనా వార్నింగ్‌

రష్యా నుంచి చమురు దిగుమతులపై నాటో, జీ7 దేశాలు సుంకాలు విధించాలని అమెరికా పిలుపునిచ్చిన నేపథ్యంలో చైనా తీవ్రంగా స్పందించింది. ఇది ఏకపక్ష వేధింపులు, ఆర్థిక బలప్రదర్శన మాత్రమేనని విమర్శించింది. అమెరికా చెప్పినట్లు చేస్తే ప్రతిచర్యలు తప్పవని చైనా హెచ్చరించింది. ఉక్రెయిన్‌ సమస్యకు చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని చైనా స్పష్టం చేసింది. కాగా, ట్రంప్‌ ఇటీవల చైనాపై 50–100% సుంకాలు విధిస్తానని సంకేతం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్