ఒడిశాలోని కటక్‌లో దుర్గా నిమజ్జనం సందర్భంగా డీజే పెట్టడంపై రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు రాళ్లదాడికి తెగబడి వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో డీసీపీ రిషికేశ్ ఖిలారీతో సహా ఆరుగురికి గాయాలు అయ్యాయి. కటక్ పోలీసులు ఆందోళనకారులను తరిమికొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘర్షణల నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగంపై ఆదివారం రాత్రి 7 గంటల నుంచి సోమవారం రాత్రి 7 గంటల వరకు నిషేధం విధిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది.