తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి, ట్రాఫిక్ సమస్యలు, భూముల బదిలీ వంటి అంశాలు చర్చించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి స్కైవేలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదిలీ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అలాగే, తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుపై కూడా చర్చ జరిగింది.