ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ ఎన్నికల ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలపై డీఎంకే ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని మోదీ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని స్టాలిన్ ఎక్స్ వేదిక చేసిన ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. తమిళులు, బీహార్ ప్రజల మధ్య విద్వేషాలు రేపే ప్రయత్నం చేయొద్దని అన్నారు. ఎన్నికల కోసం చిల్లర రాజకీయాలు మానుకోవాలని, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమంపైనే మోదీ దృష్టి సారించాలన్నారు.