అసోంలో కొత్త ప్రభుత్వం మే 11 తర్వాత.. హిమంత బిశ్వ శర్మ

అసోంలో కొత్త ప్రభుత్వం మే 11 తర్వాత కొలువుదీరనుందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు. లోక్ భవన్‌లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు తన రాజీనామా లేఖను అందజేసిన అనంతరం హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడారు. అసోం తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్