భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వెస్టిండీస్‌తో రెండో టెస్టు ప్రారంభానికి ముందు ఢిల్లీలోని తన నివాసంలో టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి ప్రత్యేక విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటగాళ్లు, సిబ్బంది ఆనందంగా పాల్గొని, మ్యాచ్‌కు ముందు ఈ స్పెషల్ డిన్నర్ చేశారు. జట్టు మొత్తం ఒకేసారి విందులో పాల్గొనడంతో సందడి వాతావారణం నెలకొంది.