TG: ఖమ్మం వైరా రోడ్‌లోని కోణార్క్ హోటల్‌లో బిర్యానీలో బొద్దింక కలిసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడిశెట్టి కృష్ణ బిర్యానీ ఆర్డర్ చేసి సగం తిన్నాక బొద్దింక కనిపించడంతో యాజమాన్యాన్ని సంప్రదించగా, డబ్బులు తిరిగి ఇస్తామని, విషయం గోప్యంగా ఉంచాలని కోరినట్టు సమాచారం. ఈ ఘటనతో హోటల్‌ల హైజీన్‌పై ప్రశ్నలు తలెత్తగా, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.