ముగ్గురిని ఢీకొట్టిన కాలేజీ బస్సు (వీడియో)

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నగరంలో ఈ నెల 24న షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులను కాలేజీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. కాలేజీ బస్సు అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్