TG: జూబ్లీహిల్స్‌లో ఓట్ చోరీ అనేది అవాస్తవమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్‌ఎస్ కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు సహజంగానే 10 నుంచి 12వేల కొత్త ఓట్లు యాడ్ అవుతూ ఉంటాయని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై తాము వ్యక్తిగత కామెంట్స్ చేయడం లేదని.. కానీ, వేదికలపై ఆమెను కేటీఆర్, హరీష్‌లు ఏడిపిస్తున్నారని మాత్రమే చెప్పామన్నారు. జూబ్లీహిల్స్‌లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు.