మహిళలను వేధించిన కేసులో కర్ణాటక కాంగ్రెస్ నేత అరెస్ట్ అయ్యారు. చిక్కమగళూరు జిల్లాకు చెందిన యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు ఆదిత్య వేధిస్తున్నాడని ఈనెల 28న ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల ఫొటోలను అసభ్య కంటెంట్‌గా మార్చి వెబ్ సైట్స్‌లో అప్ లోడ్ చేస్తున్నాడని, మెసేజింగ్ యాప్స్ ద్వారా స్ప్రెడ్ చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి అతన్ని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. కాగా స్థానికులు ఆదిత్యపై దాడి చేసిన SMలో వైరల్ అవుతోంది.