ఆన్‌లైన్ బెట్టింగ్‌కు కానిస్టేబుల్ బలి.. సీపీ సజ్జనార్ ఏమన్నారంటే!

TG: సంగారెడ్డి పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న కొఠారి సందీప్ కుమార్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సందీప్ ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్స్‌కు అలవాటుపడి నష్టం రావడంతో ఆత్మహత్య చేసున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై సీపీ సజ్జనార్ స్పందించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ పై నలుగురికి అవగాహన కల్పించాల్సిన కానిస్టేబులే.. దానికే వ్యసనపరుడై ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. జీవితంలో ఒడిదొడుకులు సహజమని, సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని తెలిపారు.

సంబంధిత పోస్ట్