యూపీలో మరో వివాహిత వరకట్నం వేధింపులతో ప్రాణాలు కోల్పోయింది. దేవేంద్ర-పరుల్(32) భార్యాభర్తలు. దేవేంద్ర కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. పరుల్ నర్సు శిక్షణ పొందింది. అయితే అదనపు కట్నం తీసుకురావాలంటూ పరుల్‌ను దేవేంద్ర తరచూ హింసించేవాడు. సెలవుపై ప్రస్తుతం దేవేంద్ర ఇంట్లోనే ఉంటుండగా.. కట్నం కోసం మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పరుల్‌కు దేవేంద్ర, బంధువులు నిప్పంటించారు. తీవ్ర గాయాలు కావడంతో పరుల్ చికిత్స పొందుతూ మరణించింది.