TG: ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి అందరూ సహకరించాలని సీఎం రేవంత్ కోరారు. ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కోర్టుల చుట్టూ తిరగొద్దని, రాజకీయ పార్టీలు ఉసిగొల్పితే ఆ చిక్కుల్లో పడవొద్దని సూచించారు. అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకోవాలని ఆయన తెలిపారు. పదేళ్లు అవకాశమిస్తే న్యూయార్క్ తో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని CM స్పష్టం చేశారు.