మొక్కజొన్న కొనుగోలు పరిమితి 25 క్వింటాళ్లకు పెంచాలి: మంత్రి తుమ్మల

TG: రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గుడ్‌న్యూస్ చెప్పారు. మొక్కజొన్న పంట కొనుగోళ్లను 18.5 క్వింటాళ్ల నుండి 25 క్వింటాళ్లకు పెంచాలని నాగేశ్వర రావు మార్క్ ఫెడ్ ఎండీని ఆదేశించారు. సోమవారం సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కోసం ఇప్పటికే 125 కేంద్రాలు ప్రారంభించామని, మిగిలిన కేంద్రాలను కూడా వెంటనే తెరిచి, కొనుగోలు పరిమితిని పెంచాలని మంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్