పత్తి రైతులను తేమ పేరిట మోసం చేస్తున్నారు: కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, తేమ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెడుతున్నారని, వేరే దిక్కులేక రైతులు ప్రైవేటుకు అమ్ముకుంటున్నారని ఆమె మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 'జాగృతి జనం బాట' కార్యక్రమంలో పాల్గొన్న కవిత, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నా రైతులకు ప్రయోజనం లేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్