సినీ నటుడు సల్మాన్ ఖాన్ 'రాజ్ శ్రీ పాన్ మసాలా' ప్రకటనల విషయంలో చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. బీజేపీ నాయకుడు ఇందర్ మోహన్ సింగ్ చేసిన ఫిర్యాదు మేరకు.. ప్రకటనలు తప్పుదారి పట్టిస్తున్నాయని, కుంకుమపువ్వు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన కోర్టు, సల్మాన్ ఖాన్‌కు నోటీసులు జారీ చేసి, నవంబర్ 27, 2025న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కొత్త సమస్యతో సల్మాన్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు.