జీవిత ఖైదు విధించిన కోర్టు.. శిక్షకు ముందు మరో హత్యాచారం

TG: మెదక్ జిల్లాలో జీవిత ఖైదు శిక్ష పడిన నిందితుడు మరో ఘోరానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం అంబుజిగూడ తండాకు చెందిన మెగావత్ ఫకీర నాయక్‌పై గతంలో ఏడు కేసులు ఉండగా, న్యాయస్థానం అతడికి జీవిత ఖైదు విధించింది. శిక్ష పడబోతోందనే కారణంతో, కొల్చారం మండలం అప్పాజీపల్లిలో కూలి పనికి వెళ్లిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, బండ రాయితో దాడి చేసి హత్య చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్