కోల్‌కతాలోని మెట్రో రైలు ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరస్థులు, అవినీతిపరులు అధికారంలో ఉండకూడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. జైలులో ఉన్న ప్రజాప్రతినిధులను పదవి నుంచి తొలగించే బిల్లుకు వ్యతిరేకంగా నిలుస్తున్న TMC ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ‘ఇప్పటి వరకు అలాంటి చట్టం లేకపోవడంతో ఒక TMC మంత్రి జైల్లో నుంచే అధికారం నిర్వహిస్తున్నారు. నేరస్థులు, అవినీతిపరులు జైల్లోనే ఉండాలి. అందుకే ఈ బిల్లును తీసుకొస్తున్నాం’ అని ప్రధాని పేర్కొన్నారు.