ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను పాడి, ఆక్వారంగాలకూ కేంద్ర ప్రభుత్వం వర్తింపజేసింది. కోతల తర్వాత కూడా బీమాను కొనసాగించాలని నిర్ణయించింది. అదేసమయంలో ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసి.. పథకం అమలు, పర్యవేక్షణ, క్లెయిమ్‌ల చెల్లింపుల్లో AI ఉపయోగించనుంది. బీమా చేసిన ప్రతీ రైతుకు గుర్తింపుకార్డును ఇచ్చి, వారి భూమికి జియోట్యాగింగ్ చేస్తుంది. PMFBY వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ నమోదుతో సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుంది.