ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. అర్ధరాత్రి వరకు దర్శనానికి అనుమతి

AP: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు 90 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో శీనా నాయక్ తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులు సంతోషంగా దర్శనం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. అర్ధరాత్రి 12:30 గంటల వరకు దర్శనానికి అనుమతిచ్చామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్