దారుణం.. రెండేళ్లుగా మైనర్ బాలుడిపై అత్యాచారం!

కేరళలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలుడిపై రెండేళ్లుగా పలువురు అత్యాచారానికి పాల్పడ్డారు. కాసరగోడ్‌లోని చందేరా ప్రాంతానికి చెందిన బాలుడు 2023లో ఎల్‌జీబీటీక్యూ డేటింగ్ యాప్ లో ఎకౌంట్ ఓపెన్ చేశాడు. ఈ క్రమంలో 23ఏళ్ల మొహమ్మద్ అఫ్సల్ అనే వ్యక్తితో పరిచయం అయింది. అయితే అఫ్సల్ బాలుడిని పలు ప్రాంతాల్లో తిప్పుతూ లైంగికంగా హింసించాడు. ఈ క్రమంలో దాదాపు 16 మంది అతనిపై అత్యాచారం చేసినట్లు సమాచారం. బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.

సంబంధిత పోస్ట్