హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు 15 ఏళ్ల బాలికపై సుమారు ఏడు నెలల పాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ యువకుడు, బాలికతో ఉన్న ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. దీంతో బాలిక తండ్రి నవంబర్ 4న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.