యూపీలోని హాపూర్ హైవే-9పై ప్రమాదకర స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువకుడు కారు నడిపుతూ సడన్‌గా స్టీరింగ్ వదిలేసి కారు ముందు భాగం పైకి, టాప్ పైకి ఎక్కి స్టంట్‌లు వేశాడు. కదులుతున్న వాహనాన్ని నియంత్రణలో లేకుండా వదిలేయడం పట్ల నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.