మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. నాందేడ్‌లోని గోలేగావ్‌కి చెందిన వివాహిత సంజీవని లఖన్ భండారే అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడుతో చనువుగా ఉన్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం ఆమె తండ్రికి సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన తండ్రి పరువు పోయిందన్న బాధతో ప్రియుడు, తన కుమార్తెను కొట్టడంతో చనిపోయారు. ఇద్దరి మృతదేహాలను బావిలో పడేశాడు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.