ప్రేమ వ్యవహారం.. కూతురిని చంపిన తండ్రి

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల యువతి తన తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లిని నిరాకరించడంతో, ఆమె తండ్రి గయ్యూర్ (48) ఆమె గొంతు కోసి చంపాడు. హత్య తర్వాత అతను పోలీసులకు లొంగిపోయాడు. మృతురాలు మరొకరిని ప్రేమించడం వల్లే ఆమె తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్