తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తనూష, సాయి ప్రియ, నందిని మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవల జరిగిన ఓ పెళ్లివేడుకలో సందడిగా గడిపిన ఈ ముగ్గురూ ఇవాళ విగత జీవులుగా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సంబంధిత పోస్ట్