ఉత్తరప్రదేశ్ నోయిడాలో దారుణం జరిగింది. డెలివరీ బాయ్ గౌరవ్ (22) ఓ మహిళ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి, బెడ్‌పై నిద్రిస్తున్న ఆమె కుమారుడి మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. మహిళను బట్టలు విప్పించి వీడియో తీసి, ఆ వీడియోతో ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడు. ఆమె భర్తకు వీడియో షేర్ చేసి, ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సెప్టెంబర్ 2న బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు గౌరవ్‌ను అరెస్ట్ చేసి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.