వందే భారత్‌కు డిమాండ్‌.. హైదరాబాద్-పూణే మధ్య మరో 2 రైళ్లు

భారతీయ రైల్వే శాఖ హైదరాబాద్- పూణే మధ్య రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ రైళ్లు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రైలు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, ప్రయాణ సమయాన్ని రెండు నుండి మూడు గంటలు తగ్గిస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నాలుగు వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. సికింద్రాబాద్-పుణే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ కొత్త రైళ్ల చేరికతో, దక్షిణ మధ్య రైల్వే ఏడు వందే భారత్ సర్వీసులను నడుపుతోంది.

సంబంధిత పోస్ట్