జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా దేవానంద్

AP: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ మెండా దేవానంద్ కుమార్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్రం నుంచి సోమవారం రాత్రి ఆయనకు సమాచారం అందింది. సెప్టెంబర్ 5న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు. 2021 నుంచి మైలవరం కళాశాలలో ఆయన ఉద్యోగం చేస్తున్నారు. 2024లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్