యూపీలోని డియోరియా జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. సరయు నదిలో ప్రయాణిస్తున్న ఒక డింగీ పడవ బోల్తా పడింది. వెంటనే వారంతా అరుపులు అరిచి, కేకలు వేశారు. వెంటనే స్థానికులు గుర్తించి.. హుటాహుటిన నీటిలో దిగి అందర్నీ సురక్షితంగా కాపాడారు. పడవలో 12 మందికిపైగా భక్తులు ఉన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణహానీ జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.