AP: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. ప్రస్తుతం 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. టోకెన్లు ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2-3 గంటల సమయం పడుతోందని తెలిపింది. శుక్రవారం శ్రీవారిని 65,717 మంది దర్శించుకున్నారు. రూ.3.39 కోట్లు ఆదాయం వచ్చింది.