ధనధాన్య కృషి యోజన.. తెలుగు రాష్ట్రాల నుంచి 8 జిల్లాల ఎంపిక

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధనధాన్య కృషి యోజన పథకానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 8 జిల్లాలను ఎంపిక చేసింది. TG నుంచి నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూల్ జిల్లాలు ఎంపిక కాగా, AP నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలకు చోటు దక్కింది. ఈ ఎంపికైన జిల్లాల్లో పంట ఉత్పాదకత, సాగు విస్తీర్ణం, రుణ వినియోగం, పంట నిల్వలను పెంచే లక్ష్యంతో ఒక్కో జిల్లాకు ఏటా రూ.240 కోట్ల చొప్పున ఆరేళ్ల పాటు కేంద్రం ఆర్థిక సహాయం అందించనుంది.

సంబంధిత పోస్ట్