తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న 'ఇడ్లీ కడై' సినిమా ఆడియో లాంచ్ చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో ధనుష్ కొడుకు లింగా స్టేజ్‌పై డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తండ్రితో కలిసి పాటకు స్టెప్పులు వేసిన లింగాను ధనుష్ హత్తుకొని ముద్దుపెట్టుకున్నారు. ఈ క్షణం ఈవెంట్‌కు హైలైట్‌గా మారింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లు "జూనియర్ ధనుష్" అంటూ కామెంట్లు చేస్తున్నారు.