లక్నో వేదికగా భారత్-A, ఆస్ట్రేలియా-A మధ్య జరుగుతున్న మొదటి అనధికారిక టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా-A ఆటగాడు ధ్రువ్ జురెల్ అద్భుత సెంచరీ సాధించారు. ధ్రువ్ 132 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 113 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పడిక్కల్ (86*), సాయి సుదర్శన్ (73), జగదీశన్ (63) అర్థశకాలతో రాణించారు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 403 పరుగులు చేసింది. భారత్-A ఇంకా 129 పరుగుల వెనుకబడి ఉంది.