మహిళల వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి జగజ్జేతగా నిలిచిన టీమ్‌ఇండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో, సూరత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపీ గోవింద్ ఢోలాకియా భారత మహిళా జట్టుకు ప్రత్యేక కానుకలు ప్రకటించారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాసిన ఆయన, ఒకవేళ భారత అమ్మాయిలు కప్పు సాధిస్తే జట్టు సభ్యులందరికీ వజ్రాల ఆభరణాలను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు.