టీవీకే అధ్యక్షుడు విజయ్ రోడ్ షో ర్యాలీలో తొక్కిసలాటకు కరెంట్ పోవడమే కారణమని పలువురు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విజయ్ ప్రచార వాహనం వద్దకు చేరుకోగానే.. విద్యుత్ సరఫరా ఆపేయడంతో తొక్కిసలాట జరిగిందంటున్నారు. తమ అభిమాన నటుడిని దగ్గరగా చూడాలన్న ఆత్రుతతోనే ఇలా జరిగిందని కొందరు అంటే.. భారీగా వచ్చిన ప్రజలను కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారని, అందువల్లే జరిగిందని మరికొందరు చెబుతున్నారు.