దీపావళి: కాలిఫోర్నియా రాష్ట్ర ప్రత్యేక దినంగా గుర్తింపు

కాలిఫోర్నియాలో దీపావళి పండుగకు అధికారిక గుర్తింపు లభించింది. గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌ ఇటీవల ‘అసెంబ్లీ బిల్‌ 268’పై సంతకం చేసి దీపావళిని రాష్ట్ర ప్రత్యేక దినంగా ప్రకటించారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు దీపావళి రోజున వేతనంతో సెలవు పొందనున్నారు. విద్యాసంస్థల్లో కూడా దీపావళి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి లభించింది. ఈ చట్టం ప్రవాస భారతీయుల సంస్కృతికి గౌరవం చాటిందని, కాలిఫోర్నియా సమ్మిళిత స్ఫూర్తికి ఇది నిదర్శనమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

సంబంధిత పోస్ట్