చేపలు నిద్రపోతాయా?.. ఎలా తెలుస్తుంది?

చేపలు నిద్రపోవా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి చేపలు కూడా నిద్రపోతాయి. అయితే మనుషుల్లా కనురెప్పలు లేకపోవడంతో అవి నిద్రలో ఉన్నట్లు స్పష్టంగా కనిపించవు. సాధారణంగా చేపలు పూర్తిగా స్థిరంగా ఉండకపోయినా, కదలికలను తగ్గించి విశ్రాంతి తీసుకుంటాయి. కొన్ని చేపలు పగటివేళల్లో నిద్రిస్తే, మరికొన్ని రాత్రివేళల్లో విశ్రాంతి తీసుకుంటాయి. నిద్రపోయే సమయంలో సముద్రంలో పగడపు దిబ్బలు లేదా సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లి దాక్కుంటాయి. కొన్ని జాతులు తమ చుట్టూ రక్షణ పొరను సృష్టించుకుని శత్రువులకు కనిపించకుండా నిద్రిస్తాయి. కాగా, చేపలకు గాఢనిద్ర ఉండదు.

సంబంధిత పోస్ట్