మన దేశంలో ప్రజలు పన్ను చెల్లించని రాష్ట్రం ఏదో తెలుసా?

భారతదేశంలో ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం పన్నులు వసూలు చేస్తారు. అయితే, ఉత్తర భారతదేశంలోని సిక్కిం రాష్ట్రం పన్ను రహిత రాష్ట్రంగా ప్రత్యేకతను కలిగి ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(F) మరియు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(26AAA) ప్రకారం, సిక్కిం ప్రజలు ఆదాయపు పన్ను నుండి పూర్తిగా మినహాయింపు పొందారు. 1975లో భారతదేశంలో విలీనమైనప్పటికీ, సిక్కింలో పాత పన్ను వ్యవస్థ కొనసాగుతోంది. రాష్ట్ర పౌరులు తమ ఆదాయంపై కేంద్ర ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, రాష్ట్రం వెలుపల నుండి వచ్చే ఆదాయం పన్నుకు లోబడి ఉంటుంది.

సంబంధిత పోస్ట్