వయస్సును బట్టి ఎంత సేపు నిద్రపోవాలో తెలుసా?

నిద్ర ఆరోగ్యానికి కీలకం. వయస్సును బట్టి అవసరమయ్యే నిద్ర సమయం వేరుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నివేదికల ప్రకారం, నవజాత శిశువులు రోజుకు 14–17 గంటలు, 4–11 నెలల పిల్లలు 12–15 గంటలు, 1–2 ఏళ్ల పిల్లలు 11–14 గంటలు నిద్రపోవాలి. 3–5 ఏళ్ల వారికి 10–13 గంటలు, 6–12 ఏళ్ల వారికి 9–12 గంటలు, 13–18 ఏళ్ల టీనేజర్లకు 8–10 గంటలు అవసరం. 18–60 ఏళ్ల వయోజనులు 7–9 గంటలు, 61 ఏళ్లు పైబడినవారు 7–8 గంటలు నిద్రపోవడం మంచిదట.

సంబంధిత పోస్ట్