ఇలస, పులస చేపలు రెండూ చూడటానికి ఒకే విధంగా ఉన్నా.. వీటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. గుడ్లు పెట్టేందుకు సముద్రపు నీటి నుంచి గోదావరి ప్రవాహానికి ఎదురీదితూ వచ్చే చేపను పులస అంటారు. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య గోదావరి వైపు వచ్చే చేపలను పులస అంటారు. ఈ చేపనే సముద్రంలో ఉన్నప్పుడు ఇలసగా పిలుస్తారు. సముద్రపు ఉప్పు నీటి నుంచి మంచి నీటిలోకి వెళ్లడంతో ఇలస చేప కాస్తా పులసగా మారుతుంది.