మైక్రోప్లాస్టిక్స్ అనేవి 5 మిల్లీమీటర్ల కంటే చిన్న ప్లాస్టిక్ కణాలు. ఇవి కంటికి కనిపించనంత చిన్నవిగా ఉన్నప్పటికీ.. ఆహారం, నీరు, పానీయాల ద్వారా శరీరంలోకి చేరి ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది. ఈ కణాలు సముద్రాలు, నదులు, గాలి, నేల, ఆహారం వంటి అనేక మార్గాల ద్వారా పర్యావరణంలో వ్యాపిస్తున్నాయి. మన చుట్టూ ఉన్న నీటిలో, గాలిలో, నేలలో, మనం తినే ఆహారంలో కూడా ఇవి ఉంటాయి.