టీ షర్టులో T అంటే ఏంటో తెలుసా?

టీ-షర్ట్‌ పేరు వెనుక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. తేలికగా, సౌకర్యవంతంగా ఉండే ఈ దుస్తులను ఎనిమిది నుంచి ఎనభై ఏళ్లవారు కూడా ఇష్టపడతారు. అయితే టీ షర్టులో 'T' అక్షరానికి రెండు అర్థాలు ఉన్నాయని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. ఒకటి.. కాలర్ లేకుండా నిటారుగా ఉండే చేతులు, శరీరం కలిసిపోవడం వల్ల ఆకారం 'T' లా కనిపించడం. రెండోది.. మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికన్ సైనికులు వాడిన ట్రైనింగ్ షర్ట్స్ పేరు క్రమంగా T-Shirt గా మారిందని నిపుణులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్