9,550 ఏళ్ల నాటి చెట్టు.. ఎక్కడ ఉందో తెలుసా?

కొన్ని చెట్లు తరాల కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి, నాగరికతలను, భౌగోళిక యుగాలను చూస్తాయి. స్వీడన్‌లోని ఫులుఫ్జాలెట్ పర్వత ప్రాంతంలో పెరుగుతున్న ఓల్డ్ త్జికో అనే నార్వే స్ప్రూస్ వృక్షం 9,550 ఏళ్ల నాటి వేర్లతో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదిగా పేరుగాంచింది. 2004లో ప్రొఫెసర్ లీఫ్ కుల్మాన్ కనుగొన్న ఈ చెట్టు, లేయరింగ్ ప్రక్రియ ద్వారా మనుగడ సాగిస్తోంది. పాత కాండం చనిపోయినా, వేర్లు కొత్త మొలకలను ఇస్తూనే ఉంటాయి. ఇది రాతి యుగంలో మొలకెత్తిందని, ఆ కాలంలో స్వీడన్ వాతావరణం వెచ్చగా ఉండేదని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్