ఒక వ్యక్తి ఆవలించడాన్ని చూసినప్పుడు మనం కూడా ఆవలించటం సహజం. బంధువులు లేదా స్నేహితులు ఆవలిస్తే అది మరింత పాకే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది సహానుభూతికి సంకేతమై ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేకాక, ఇతరులను అనుకరించే మిర్రర్ న్యూరాన్ల ప్రభావం వల్ల కూడా ఇది జరుగుతుందన్నది నిపుణుల అభిప్రాయం.