మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి, కాల్షియం, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్ స్థాయిని పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిని, నిరంతర వాపును తగ్గించడానికి సహాయపడుతుందని ఓ అధ్యయనం పేర్కొంది. మునగాకులో ఉండే సమ్మేళనాలు శరీరాన్ని ఇన్సులిన్‌కు మరింత సున్నితంగా చేసి, గ్లూకోజ్‌ను మెరుగ్గా ఉపయోగించుకునేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.